Andhra Pradesh: విజయనగరంలో అడగుపెట్టడంతోనే జగన్‌కు ఝలక్.. అవినీతి ఆరోపణలతో ఫ్లెక్సీలు సిద్ధం చేసిన టీడీపీ!

  • విశాఖలో పాదయాత్ర చేస్తున్న జగన్
  • జగన్‌పై వచ్చిన ఆరోపణలను ఫ్లెక్సీలుగా రూపొందించిన ఎమ్మెల్యే
  • పరిశీలించిన ఎంపీ అశోక్ గజపతిరాజు

ప్రస్తుతం విశాఖపట్టణంలో పాదయాత్ర చేస్తున్న జగన్ అది ముగించుకుని విజయనగరం జిల్లాలో అడుగు పెట్టడంతోనే ఝలక్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. వైసీపీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణల అవినీతి అక్రమాలపై గతంలో పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను శృంగవరపుకోట స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఫ్లెక్సీలుగా ముద్రించి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.

అంతేకాదు, వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లపై బొత్స గతంలో చేసిన ఆరోపణలను కూడా ఫ్లెక్సీల్లో ముద్రించారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజు శుక్రవారం సాయంత్రం ఎస్.కోటకు చేరుకుని ఈ ఫ్లెక్సీలను పరిశీలించారు. పాదయాత్రలో నీతి వాక్యాలు వల్లిస్తున్న జగన్ బండారం వీటితో బయటపడుతుందని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh
Jagan
Bocha satyanarayana
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News