miryalaguda: ప్రణయ్ ను హతమార్చడం చాలా బాధాకరం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ప్రణయ్ కుటుంబసభ్యులను పరామర్శించిన వెంకటరెడ్డి
  • సీఎం కేసీఆర్ స్పందన సరిగా లేదు
  • మేము అధికారంలోకొస్తే పరువుహత్యలపై కఠిన చట్టాలు

కులాంతర వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ప్రణయ్ కుటుంబసభ్యులను ఈరోజు ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ను హతమార్చడం దారుణమైన విషయమని, చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర సంఘటనలపై సీఎం కేసీఆర్ స్పందన సరిగా లేదని విమర్శించారు. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యే కేసీఆర్ సచివాలయానికి రాకున్నా, కనీసం, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా స్పందించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే పరువుహత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెంకటరెడ్డి అన్నారు.

miryalaguda
komati reddy
venkata reddy
  • Loading...

More Telugu News