jc diwakar reddy: సీఐ మాధవ్ అలా అనడంపై చింతిస్తున్నాం: పోలీసుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు

  • జీవో 539 ప్రకారమే మా సంఘం ఏర్పడింది
  • పోలీసులపై వ్యాఖ్యలతో మాధవ్ ఆవేదన చెందారు
  • అందుకే, మాధవ్ మీసం తిప్పి, నాలుక కోస్తా అన్నారు

తమను కించపరిస్తే నాలుక కోస్తామంటూ ఏపీ పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పందించారు. జీవో 539 ప్రకారమే తమ సంఘం ఏర్పడిందని, పోలీసులపై వ్యాఖ్యల కారణంగా ఆవేదన చెందడం వల్లే సీఐ మాధవ్ మీసం తిప్పి, నాలుక కోస్తా అన్న వ్యాఖ్య చేశారని సమర్థించుకున్నారు. అయితే, మాధవ్ అలా వ్యాఖ్యానించడంపై చింతిస్తున్నామని చెప్పారు. పోలీసులు సరిగా పనిచేశారు కనుకనే అనంతపురంలో పరిస్థితి అదుపులో ఉందని అన్నారు.

jc diwakar reddy
Anantapur District
  • Loading...

More Telugu News