jc diwakar reddy: జేసీ దివాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రబోధానంద స్వామి

  • 2003లో కృష్ణ మందిరం ప్రారంభోత్సవానికి దివాకర్ రెడ్డిని పిలిచాం
  • డబ్బు ఇవ్వలేదనే కారణంతో తమపై కక్షగట్టారు
  • పక్క గ్రామాల ప్రజలను ఉసిగొలిపారు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ప్రబోధానంద స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. 2003లో ఆశ్రమంలోని కృష్ణ మందిరం ప్రారంభోత్సవానికి దివాకర్ రెడ్డిని తాము పిలిచామని ఆయన తెలిపారు. ఆయనకు తాము డబ్బు ఇవ్వలేదనే కారణంతో తమపై ఆయన కక్షగట్టారని, తమను ఎంతో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షతో పక్క గ్రామాల ప్రజలను ఉసిగొల్పారని మండిపడ్డారు.

తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం లేదని తెలిపారు. ఆశ్రమంలో తప్పు జరిగితే జనం ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా ఆశ్రమానికి వస్తుంటారని తెలిపారు. ప్రచారం కోసం తాము పాకులాడటం లేదని చెప్పారు. అడిగిన వారికి అన్నం పెట్టామని తెలిపారు. 1993లో బీజేపీ నేతలకు ఆశ్రయం కల్పించామని తమను తరిమి కొట్టారని... కొంతకాలం బెంగళూరులో ఉండి 2003లో ఆశ్రమాన్ని మళ్లీ ప్రారంభించామని చెప్పారు.

jc diwakar reddy
prabodhananda swamy
  • Loading...

More Telugu News