gurajada apparao: సాంఘిక దురాచారాలపై గురజాడ అక్షరాగ్ని.. 'కన్యాశుల్కం'!: చంద్రబాబు నివాళులు
- తెలగు సాహిత్యంలో కొత్త ఒరవడికి నాంది పలికారు
- కఠినమైన తెలుగు సాహిత్యాన్ని ప్రజా భాషతో పరుగులు పెట్టించారు
- సంఘ సంస్కరణలకు మానవతా పరిమళాలను అద్దారు
ప్రముఖ సంఘసంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సాహిత్యంలో కొత్త ఒరవడికి నాంది పలికిన మహాకవి గురజాడ అని అన్నారు. కఠిన పదబంధాలతో ఉన్న తెలుగు సాహిత్యాన్ని... ప్రజా భాషతో పరుగులు పెట్టించిన ఘనత గురజాడది అని కొనియాడారు. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ వన్నె తగ్గలేదని చెప్పారు. ఆనాటి సాంఘిక దురాచారాలపై గురజాడ అక్షరాగ్నే కన్యాశుల్కమని అన్నారు.
'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అనే గీతం తెలుగు జాతి ఉన్నంత వరకు స్ఫూర్తినిచ్చే పతాక గీతమని చంద్రబాబు చెప్పారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయం ద్వారా బాల్య వివాహాలను గురజాడ నిరసించారని తెలిపారు. సంఘ సంస్కరణలకు మావనతా పరిమళాలను అద్దిన గొప్ప వ్యక్తి గురజాడ అని కితాబిచ్చారు.