raja singh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజాసింగ్ కు నోటీసులు!

  • 2017 ఏప్రిల్ 9న శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్ ప్రసంగం
  • ఓ వర్గ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఫిర్యాదు
  • సెక్షన్ 41 ప్రకారం రాజాసింగ్ కు నోటీసులు

బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైదరాబాద్ షాయినాథ్ గంజ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో ఓ వర్గానికి చెందిన ప్రజలపై రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలతో నోటీసులు జారీ అయ్యాయి. 2017 ఏప్రిల్ 9న రాణి అవంతిబాయి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, ఆయనపై ట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఎంబీటీ మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ డబిల్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతం షాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఇక్కడకు బదిలీ చేశారు. విచారణ అనంతరం సెక్షన్ 41 ప్రకారం రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. 

raja singh
bjp
notice
  • Loading...

More Telugu News