sayesha saigal: ప్రభుదేవా అంటే ఇష్టం .. ఆయన దర్శకత్వంలో నటించాలని వుంది : సాయేషా సైగల్

  • తెలుగు నుంచి రాని అవకాశాలు 
  • తమిళంలో పెరుగుతోన్న జోరు
  • డాన్స్ తో అదరగొట్టేస్తోన్న సాయేషా     

తెలుగుకు తెరకి 'అఖిల్' సినిమాతో సాయేషా సైగల్ పరిచయమైంది. ఆ సినిమా ఆడకపోవడంతో, ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు. అయితే తమిళంలో మాత్రం ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అగ్రకథానాయకుల సరసన అవకాశాలు వరుసగా వచ్చిపడుతున్నాయి. సాధారణంగా బొద్దుగా వుండే కథానాయికలనే ఇష్టపడే తమిళ ప్రేక్షకులు .. అందుకు భిన్నంగా ఈ నాజూకు భామను ఆరాధిస్తూ ఉండటం విశేషం.

ఈ సుందరి ఒక రేంజ్ లో డాన్స్ చేస్తుందనే టాక్ వుంది. డాన్స్ ను తాను బాగా చేయడానికి కారణం ప్రభుదేవా అనీ .. ఆయన స్ఫూర్తితోనే పది రకాల డాన్సులు నేర్చుకున్నానని సాయేషా చెబుతోంది. తనకి ప్రభుదేవా అంటే ఎంతో ఇష్టమనీ .. ఆయన దర్శకత్వంలో నటించాలని ఉందని అంది. గతంలో ఒకసారి ఆవకాశం వచ్చినా ఆ సినిమా పట్టాలెక్కలేదనీ .. అప్పటి నుంచి ఆయన సినిమాలో చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూనే వున్నానని చెప్పుకొచ్చింది.

sayesha saigal
  • Loading...

More Telugu News