Sachin Tendulkar: పొరపాటు చేసిన సచిన్ టెండూల్కర్... నెటిజన్ల విమర్శలు!

  • ఆకాశ్ చోప్రాకు పుట్టినరోజు శుభాకాంక్షలు
  • పొరపాటున ద్రవిడ్ ఫొటో పెట్టిన సచిన్
  • విషయం తెలుసుకుని ట్వీట్ డిలీట్

మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఓ చిన్న పొరపాటు చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటోను ఆయన పోస్టు చేయగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన పోస్టులను తొలగించాల్సి వచ్చింది.

ఇంతకీ ఏమైందంటే, ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా ఉన్న ఆకాశ్ చోప్రా పుట్టినరోజును పురస్కరించుకుని, సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో అభినందనలు తెలిపారు. అయితే, ఆకాశ్ చోప్రా ఫొటో బదులు ద్రవిడ్ ఫొటోను పెట్టారు. దాని కింద "‘కామెంటేటర్, హోస్ట్, అనలిస్ట్, ఆథర్, గొప్ప ఓపెనర్.. చాలా టాలెంట్లు కలిగిన నా స్నేహితుడు ఆకాశ్ చోప్రాకు జన్మదిన శుభాకాంక్షలు" అని క్యాప్షన్ పెట్టారు. సచిన్ చేసిన పొరపాటు వైరల్ కాగా, నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆపై తన ట్వీట్ ను సచిన్ డిలీట్ చేశారు.

Sachin Tendulkar
Rahul Dravid
Akash Chopra
  • Loading...

More Telugu News