bjp: బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు అస్వస్థత

  • రాంచందర్ రావుకు కడుపునొప్పి, వాంతులు
  • బంజారాహిల్స్ లోని కేర్ కు తరలింపు
  • మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలన్న వైద్యులు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండడంతో అనుచరులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెప్పినట్టు సమాచారం. 

bjp
ramchandar rao
  • Loading...

More Telugu News