Andhra Pradesh: 11వ పీఆర్సీ చైర్మన్ కు ఏపీ సచివాలయ ఉద్యోగుల వినతిపత్రం
- అశుతోష్ మిశ్రాను కలిసిన ఉద్యోగులు
- పీఆర్సీ అమలుకు సంబంధించి 29 ప్రతిపాదనలు
- ఫిట్ మెంట్ 55 శాతం ఇవ్వాలని డిమాండ్
ఏపీ ప్రభుత్వం నియమించిన 11వ పీఆర్సీ చైర్మన్ అశుతోష్ మిశ్రాను సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రతినిధులు గురువారం కలిశారు. పీఆర్సీ అమలుకు సంబంధించి 29 ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రంను ఆయనకు అందజేశారు. ఫిట్ మెంట్ 55 శాతం ఇవ్వాలని, సచివాలయ ఉద్యోగులకు కనిష్ట వేతనం రూ.24 వెలు, గరిష్టంగా రూ.2,44,440 ఉండేలా పెంచాలని కోరారు.
11వ పీఆర్సీ కమిషన్ సిఫార్సులను ఈ ఏడాది జులై నుంచి వర్తింపజేయాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షనరీ విధానాన్ని కొనసాగించాలని, వాటితో మరో 25 అంశాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ, మహిళా ఉద్యోగ సంఘం అధ్యక్షురాలు సత్యసులోచన, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.