pandya: హార్దిక్ పాండ్యా స్థానంలో చాహర్

  • వెన్ను నొప్పితో బాధపడుతున్న పాండ్యా
  • పాండ్యా స్థానంలో చాహర్ కు అవకాశం
  • ఈరోజు దుబాయ్ చేరుకోనున్న చాహర్

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియా కప్ నుంచి వైదొలిగాడు. నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హర్దిక్ తీవ్ర వెన్నునొప్పికి గురయ్యాడు. నొప్పిని తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత ట్రీట్ మెంట్ ఇచ్చినా నొప్పి తగ్గకపోవడంతో... మిగిలిన మ్యాచ్ లలో హార్దిక్ ను  ఆడించడం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో దాపక్ చాహర్ కు అవకాశాన్ని కల్పించారు. ఈరోజు చాహర్ దుబాయ్ చేరుకుంటాడని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.

పాక్ తో జరిగిన మ్యాచ్ లో 18వ ఓవర్ లో ఐదవ బంతిని వేసిన తర్వాత నొప్పి తట్టుకోలేక పాండ్యా మైదానంలోనే పడుకున్నాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. దీంతో, అతడిని స్ట్రెచర్ పై మైదానం నుంచి తరలించారు. అతని స్థానంలో మనీష్ పాండే సబ్ స్టిట్యూట్ గా వచ్చాడు.

pandya
asia cup
team india
deepak chahar
  • Loading...

More Telugu News