Anantapur District: ప్రబోధానంద ఆశ్రమం చుట్టూ కంచె వేస్తున్న పోలీసులు.. రాళ్లదాడి చేసిన భక్తులు!

  • ఈ రోజు ఉదయం పని ప్రారంభం
  • రాళ్లదాడికి దిగిన భక్తులు
  • కింది నుంచి భవనాలపైకి రాళ్లు విసిరిన స్థానికులు

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రబోధానంద స్వామి ఆశ్రమం చుట్టూ పోలీసులు కంచె వేయడం ప్రారంభించడంతో కొందరు భక్తులు రెచ్చిపోయారు. కంచె వేసేందుకు యత్నిస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులు కొందరు ఆశ్రమానికి చెందిన భవనాలపైకి రాళ్లను విసిరారు. వీరికి స్థానిక మహిళలు సహకారం అందించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు కంచె వేసే పనిని కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ఆశ్రమం వద్దకు ప్రబోధానంద భక్తులు భారీగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఘటనాస్థలానికి రావొద్దని భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Anantapur District
prabodhanandha
jc diwakar reddy
  • Loading...

More Telugu News