bear: కరీంనగర్ టెలిఫోన్ భవన్ లోకి వచ్చిన ఎలుగుబంటి

  • భయభ్రాంతులకు గురైన సిబ్బంది, స్థానికులు
  • అటవీ సిబ్బందికి సమాచారం
  • ఎలుగుబంటిని పట్టుకునే పనిలో అటవీ సిబ్బంది

పర్యావరణానికి చేటు కలిగించేలా మనమంతా అడవులను నాశనం చేస్తుంటే... అడవుల్లో హాయిగా బతికే జంతువులు దిక్కుతోచని స్థితిలో జనారణ్యాలలోకి వచ్చిపడుతున్నాయి. ఊర్లలోకి వచ్చి జనాలను భయకంపితులను చేస్తున్నాయి. కరీంనగర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

పట్టణంలోని టెలిఫోన్ భవన్ లోకి ఓ ఎలుగుబంటి రావడంతో... అక్కడున్న సిబ్బంది, స్థానికులు బిక్కచచ్చిపోయారు. తీవ్ర ఆందోళనకు గురైన వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది... ఎలుగుబంటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో ఊర్లలోకి వచ్చిన ఎలుగుబంట్లు జనాలను గాయపరిచిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి.

bear
telephone bhavan
karimnagar
  • Error fetching data: Network response was not ok

More Telugu News