Trains: రైళ్లలో కాఫీ, టీల ధర పెంపు!
- రూ. 7 నుంచి రూ. 10కి ధర పెంపు
- సాధారణ టీ రూ. 5కే
- అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు
ఇండియాలోని రైళ్లలో టీ, కాఫీల ధరను పెంచుతున్నట్టు ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రకటించింది. ప్రస్తుతం రూ. 7గా ఉన్న ధరను రూ. 10కి పెంచుతున్నామని తెలిపింది. డిప్ టీ కాకుండా, మామూలు టీని రూ. 5కే అందిస్తామని రైల్వే బోర్టు పేర్కొంది.
సూచించిన ధరల కన్నా అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా అధికారులు హెచ్చరించారు. ఇక శతాబ్ది, రాజధాని రైళ్లలో ఆహారం కోసం ప్రయాణికులు ముందుగానే ధర చెల్లిస్తున్నందున ధరల్లో మార్పు ఉండదని స్పష్టం చేశారు. కాగా, రూ. 10 కన్నా అధికంగా డబ్బులు వసూలు చేయకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ అధికారులను ఆదేశించారు.