Kakinada: కాకినాడ సమీపంలో టీడీపీ స్థూపం ధ్వంసం... ఉద్రిక్తత!

  • అయినవిల్లిలో ఘటన
  • 'గ్రామదర్శిని - గ్రామ వికాసం' గుర్తుగా స్థూపం
  • ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ స్థూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇటీవల జరిగిన 'గ్రామదర్శిని - గ్రామ వికాసం' కార్యక్రమంలో భాగంగా, పొట్టిలంక రహదారి పక్కన ఈ స్థూపాన్ని శాసన సభ్యుడు పులపర్తి నారాయణమూర్తి ఆవిష్కరించారు. దీన్ని ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకుని తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగగా, అయినవిల్లి పోలీసు అధికారులు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. టీడీపీ నేతలు వడ్డి శ్రీనివాస్‌, మద్దా రాంబాబు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Kakinada
Ayinavilli
Telugudesam
  • Loading...

More Telugu News