Jet Airways: జెట్ విమానంలో తగ్గిన క్యాబిన్ ప్రెజర్... చెవులు, ముక్కుల్లోంచి రక్తంతో తీవ్ర కలకలం!

  • ముంబై - జైపూర్ విమానంలో ఘటన
  • 30 మందికి తీవ్ర అస్వస్థత
  • సిబ్బంది తప్పే కారణమన్న డీజీసీఏ

ముంబై నుంచి జైపూర్ కు 166 మంది ప్రయాణికులతో బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో తీవ్ర కలకలం చెలరేగింది. క్యాబిన్ లో వాయు పీడనాన్ని స్థిరంగా ఉంచే బటన్ ను సిబ్బంది నొక్కకపోవడంతో, దాదాపు 30 మంది ప్రయాణికుల ముక్కులు, చెవుల్లోంచి రక్తం వచ్చింది. ఆక్సిజన్ తక్కువైపోయి ప్రయాణికులకు తలపోటు వచ్చింది.

క్యాబిన్ లో ఆక్సిజన్ మాస్కులు తెరచుకోగా, విషయాన్ని గ్రౌండ్ స్టాఫ్ కు చెప్పిన పైలట్లు, దాన్ని తిరిగి న్యూఢిల్లీలో ఎమర్జెన్సీ లాండ్ చేశారు. ఆపై వైద్య బృందం ప్రయాణికులకు చికిత్స అందించింది. ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ సమయంలో సిబ్బంది చేసిన తప్పే ఈ ఘటనకు కారణమని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.

Jet Airways
New Delhi
Flight
Cabin Preasure
  • Loading...

More Telugu News