kidnap: షాద్ నగర్ లో విద్యార్థి కిడ్నాప్.. గాలిస్తున్న పోలీసులు!

  • ట్యూషన్ కు వెళ్లివస్తున్న కౌశిక్
  • కారులో ఎత్తుకెళ్లిన దుండగులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి

షాద్ నగర్ లో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. ట్యూషన్ కు వెళ్లి వస్తున్న విద్యార్థిని కారులో ఎత్తుకెళ్లారు. దీంతో పిల్లాడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి ఠాగూర్ స్కూలులో కౌశిక్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. కౌశిక్ తండ్రి వెంకటేశ్వరరావు బీఏఎం కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ట్యూషన్ కు వెళ్లి వస్తుండగా ఏపీ22ఈఈ5201 నంబర్ ఇన్నోవా కారు కౌశిక్ ను అడ్డగించింది. అందులోనుంచి దిగిన కొందరు దుండగులు పిల్లాడిని కారులో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కౌశిక్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

kidnap
Telangana
shadnagar
Police
  • Loading...

More Telugu News