Mohan babu: మంచువారింట విషాదం... కన్నుమూసిన మోహన్ బాబు తల్లి!

  • ఈ ఉదయం మరణించిన లక్ష్మమ్మ
  • ఆమె వయసు 85 సంవత్సరాలు
  • ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్ బాబు కుటుంబం

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం మోహన్‌ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. ప్రస్తుతం తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌ లో సేదదీరుతున్న ఆమె, ఈ ఉదయం ఆరు గంటలకు మరణించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని స్వదేశానికి బయలుదేరారని సమాచారం. మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు రేపు తిరుపతిలో జరుగనున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News