YSRCP: జగన్ సీఎం కావాలని... అన్నవరంలో పూజలు చేసి, ప్రసాదం తినిపించిన కడప యువతి!

  • కడప నుంచి అన్నవరం వచ్చిన సునీతారెడ్డి
  • అర్చన చేయించి, ప్రసాదం తీసుకుని పాదయాత్ర వద్దకు
  • పలకరించి ప్రసాదం తిన్న జగన్

ఆమెపేరు సునీతారెడ్డి. ఊరు కడప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు వీరాభిమాని. జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న వేళ, ఆయన సీఎం కావాలని కోరుతూ అన్నవరం వెళ్లి అర్చన చేయించి ప్రసాదం తీసుకుని జగన్ వద్దకు వచ్చింది. పాదయాత్ర ప్రారంభమయ్యే వేళ, విషయం అక్కడి సెక్యూరిటీ వారికి చెప్పగా, వారు, జగన్ కు విషయం చేరవేశారు.

ఆ వెంటనే జగన్, సునీతారెడ్డిని కలిసి పలకరించారు. ఆమె అందించిన ప్రసాదం తిని, యాత్ర సాగించారు. అనంతరం సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తనకు వైఎస్ఆర్ కుటుంబం అంటే చాలా ఇష్టమని, రాష్ట్ర భవిష్యత్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్ సీఎం అయితేనే, అన్ని వర్గాల ప్రజల సమస్యలూ తీరుతాయని చెప్పింది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే, జగన్ రావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని సత్యదేవుని ప్రార్థించానని తెలిపింది.

YSRCP
Jagan
Sunita Reddy
Annavaram
  • Loading...

More Telugu News