BCCI: దుబాయ్‌లో మండుతున్న ఎండలు.. టీమిండియా ఆటగాళ్ల చిట్కా ఇది!

  • టోపీలో ఐస్ గడ్డలు
  • మెడపై నీళ్ల బాటిళ్లు
  • వీడియో పోస్టు చేసిన బీసీసీఐ

ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు. 40 డిగ్రీలకు పైగా కాస్తున్న ఎండ వేడికి తట్టుకోలేకపోతున్న భారత ఆటగాళ్లు పాటిస్తున్న ఉపశమన చర్యలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

హాంకాంగ్‌తో మ్యాచ్ తర్వాత పాకిస్థాన్‌తో పోరుకు భారత ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ప్రాక్టీస్‌లో విపరీతంగా చెమటోడ్చారు. అయితే, ఎండ వేడిమిని తట్టుకోవడం వారి వల్ల కాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కీలక మ్యాచ్‌‌లో తలపడాల్సి ఉండడంతో ప్రాక్టీస్ తప్పనిసరి. దీంతో ఉపశమనం కోసం టోపీల్లో మంచు ముక్కలు వేసుకున్నారు. తలపై చల్లని మంచినీళ్ల బాటిళ్లు పెట్టుకున్నారు. కొందరైతే ఏకంగా ఐస్ డబ్బాలోనే తలదూర్చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన బీసీసీఐ.. దుబాయ్ ఎండలకు టీమిండియా కనిపెట్టిన కొత్త పధ్ధతి అంటూ క్యాప్షన్ తగిలించింది.

  • Loading...

More Telugu News