jagga reddy: ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: విచారణలో జగ్గారెడ్డి

  • మొదటి రోజు ముగిసిన విచారణ
  • నేటి నుంచి 21 వరకూ కస్టడీ
  • చాలా మంది సంతకాల కోసం వస్తుంటారన్న జగ్గారెడ్డి

మానవ అక్రమ రవాణా కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. ఆయనను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నేడు మొదటి రోజు విచారణను ముగించారు. జగ్గారెడ్డిని పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరగా... కోర్టు మూడు రోజులకు అనుమతినిచ్చింది. నేటి నుంచి 21 వరకూ విచారణకు అనుమతించింది.

జగ్గారెడ్డి న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరగాలని న్యాయస్థానం ఆదేశించింది. తాను ప్రజా ప్రతినిధినని.. తన కోసం నియోజకవర్గం నుంచి చాలా మంది సంతకాల కోసం వస్తుంటారని విచారణ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పినట్టు ఆయన న్యాయవాది వెల్లడించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం.

jagga reddy
police custody
congress
  • Loading...

More Telugu News