wow airlines: బంపర్ ఆఫర్ ప్రకటించిన వావ్ విమానయాన సంస్థ

  • రూ.13,499లతో ఢిల్లీ నుంచి అమెరికా, కెనడాలకు ప్రయాణం
  • ఈ నెల18 నుంచి 28వ తేదీల మధ్య టికెట్ల విక్రయం
  • డిసెంబర్ నుంచి 2019 మార్చి మధ్య వినియోగం

ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్, బాల్టిమోర్, ఓర్లాండో, డెట్రాయిట్, బోస్టన్, చికాగో, పిట్స్‌బర్గ్, సెయింట్ లూయిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజిల్స్ నగరాలకు కేవలం రూ.13,499తో ప్రయాణించవచ్చు. కానీ ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అమలులో వుంటుంది. 'వావ్' విమానయాన సంస్థ ఈ అతి చవకైన ఆఫర్‌ను ప్రకటించింది.

ఈ ఆఫర్ ప్రకారం ఢిల్లీ నుంచి అమెరికా, కెనడాలకు కేవలం రూ.13,499కే ప్రయాణించవచ్చు. కాకపోతే ఈ నెల 18 నుంచి 28 లోగా టికెట్లను కొనుగోలు చేయాల్సివుంటుంది. ఐస్‌లాండ్ కేంద్రంగా పనిచేసే 'వావ్' ఎయిర్ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2019 మార్చి మధ్యలో ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

డిసెంబర్ 7న ఢిల్లీ నుంచి ఐస్‌లాండ్‌లోని సంస్థ ప్రధాన కేంద్రమైన రేజావిక్‌కు విమానాలను ప్రారంభించనున్నట్టు వావ్ ఎయిర్ తెలిపింది. ఉత్తర అమెరికా, ఐరోపాలను కలుపుతూ ఢిల్లీకి వారానికి మూడు సార్లు వావ్ ఎయిర్ విమానాలను నడపనుంది. జనవరి నుంచి వీటిని వారానికి ఐదు సార్లకు పెంచుతారు.  

wow airlines
america
canada
delhi
ticket price
  • Loading...

More Telugu News