Rupee: మరింత క్షీణించిన రూపాయి.. అమెరికాలో విద్యార్థుల అగచాట్లు!
- భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతున్న రూపాయి క్షీణత
- 72 స్థాయి కంటే క్షీణించిన రూపాయి
- తక్కువ ధర కలిగిన పండ్లు, కూరగాయలే ఆహారం
రూపాయి పతనం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులపై కూడా కనిపిస్తోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరికతో, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్లిన విద్యార్థులు రూపాయి మారకపు విలువ క్షీణించడంతో నానా ఇబ్బందులు పడుతున్నారట.
రోజురోజుకూ పడిపోతున్న రూపాయి మారకపు విలువ ప్రస్తుతం 72 స్థాయి కంటే క్షీణించింది. దీంతో తమ చదువుకు, ఇతర ఖర్చులకు డబ్బు చాలక విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొందరైతే తక్కువ ధరకి లభించే పండ్లు, కూరగాయలతో పొట్ట నింపుకుంటున్నారని, మరికొందరైతే ఒక్కోసారి తిండికి డబ్బు ఖర్చుపెట్టలేక ఖాళీ కడుపుతోనే గడిపేస్తున్నారని అంటున్నారు. మరోపక్క, అమెరికాలో చదువుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్న భారతీయ విద్యార్థులు రూపాయి క్షీణత చూసి వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది.