andaman: మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం
- రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
- గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు
- సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక
చెన్నై వాతావరణ కేంద్రం మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని తెలిపింది. దీంతో రానున్న 12 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా, ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రం నుంచి దక్షిణ, మధ్య బంగాళాఖాతం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేసింది.