sensex: కొనసాగుతున్న పతనం.. వరుసగా మూడో రోజూ బేర్ మన్న మార్కెట్లు!

  • ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్న యూఎస్-చైనా వాణిజ్య యుద్ధం
  • 169 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • నిఫ్టీలో సగానికి సగం కంపెనీలకు నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం వరుసగా మూడో రోజూ కొనసాగింది. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో, మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ముఖ్యంగా కన్య్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాకులు బాగా ప్రభావితమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 169 పాయింట్లు కోల్పోయి 37,121కు పడిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 37,531 పాయింట్ల గరిష్ఠ స్థాయిని... 37,062 పాయింట్ల కనిష్ఠ స్థాయిని టచ్ చేసింది. మరోవైపు నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 11,234కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డీసీఎం శ్రీరామ్ (11.76%), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.54%), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (4.49%), మోన్శాంటో ఇండియా (3.92%), ఏఐఏ ఇంజినీరింగ్ (3.90%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అస్సెట్ మేనేజ్ మెంట్ (-11.28%), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-9.41%), రిలయన్స్ క్యాపిటల్ (-7.87%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-7.74%), విజయా బ్యాంక్ (-6.56%).  

ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లు 1.35 నుంచి 3.03 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీలో 50 స్టాకులకు గాను 23 స్టాకులు నష్టాలను మూటగట్టుకున్నాయి.   

  • Loading...

More Telugu News