Chandrababu: చంద్రబాబుతో చలసాని శ్రీనివాస్ భేటీ!

  • అమరావతిలో చంద్రబాబును కలసిన చలసాని
  • హోదా, విభజన హామీలపై అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయాలని సూచన
  • సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ భేటీ అయ్యారు. అమరావతిలో ఈరోజు ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ... అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని చలసాని కోరారు. చలసాని విన్నపంపై చంద్రబాబు స్పందిస్తూ... దీనిపై సభలో ఈరోజు తీర్మానం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి మొదటి నుంచి పోరాడుతున్న సంగతి తెలిసిందే.

Chandrababu
chalasani srinivas
special status
  • Loading...

More Telugu News