YSRCP: వంగవీటి రాధాను తప్పించడానికి నేను కారణం కాదు!: మల్లాది విష్ణు

  • అందరినీ కలుపుకుని పోతానని వెల్లడి
  • నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళతామని వ్యాఖ్య
  • బాధ్యతలు ఇచ్చిన జగన్ కు కృతజ్ఞతలు  

తన కారణంగానే విజయవాడ సెంట్రల్ సీటును వైసీపీ అధినేత జగన్ వంగవీటి రాధాకు నిరాకరించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మల్లాది విష్ణు తెలిపారు. పార్టీ నేతలందరినీ కలుపుకుని పోయి పార్టీ విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ‘గడప గడపకు వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో భాగంగా జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు అప్పగించిన జగన్ కు మల్లాది విష్ణు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

YSRCP
JAGAN
Vangaveeti radha
malladi vishnu
Vijayawada central
  • Loading...

More Telugu News