Pranay: ప్రణయ్ తండ్రి బాలస్వామికి ఉన్న అనుమానాలివి!

  • కత్తిపై ఉన్న వేలిముద్రలు శర్మవేనా?
  • ఈ విషయాన్ని ఎందుకు ధ్రువీకరించడం లేదు?
  • వేలిముద్రలు సరిపోకుంటే ప్రధాన నిందితుడు తప్పించుకోడా?
  • అమృతను కిడ్నాప్ చేస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేసిన బాలస్వామి

తన కుమారుడు, అమృత వర్షిణిని ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కేసులో విచారణ ముగిసి, పోలీసులు అన్ని వివరాలనూ మీడియా ముందుంచిన తరువాత కూడా ప్రణయ్ తండ్రి బాలాస్వామి కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిపై ఉన్న వేలిముద్రలూ, హంతకుడిగా చెబుతున్న శర్మ వేలిముద్రలూ ఒకటేనా? ఈ విషయాన్ని ఎస్పీ ఇంకా ఎందుకు ధ్రువీకరించలేదు? అని ఆయన ప్రశ్నించారు.

 వేలిముద్రలు సరిపోకుంటే, ఆసలు హంతకుడు తప్పించుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన నిందితుడు డబ్బున్నవాడు కావడంతో తప్పించుకునే ప్రమాదముందని, అతనికి ఉరిశిక్ష పడితేనే తమకు సంతోషమని చెప్పారు. మారుతీరావుకు బెయిల్ లభిస్తే, అతను మళ్లీ ఇటువంటి హత్యలకు పాల్పడవచ్చన్న అనుమానాలు తమకున్నాయని అన్నారు. అమృతను కిడ్నాప్ చేసి, తమనుంచి దూరం చేస్తారన్న అనుమానం కూడా ఉందని, మారుతీరావు జైలు నుంచి బయటకు రాకుండా పీడీ చట్టాన్ని ప్రయోగించాలని బాలస్వామి డిమాండ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News