Prakasam District: కుమార్తె ప్రియుడిని బెదిరించిన తండ్రి... భయంతో ఆత్మహత్య!

  • ప్రకాశం జిల్లా ఈతముక్కలలో ఘటన
  • బెదిరింపులకు భయపడి వెంకటకృష్ణ ఆత్మహత్య
  • ప్రియురాలి తండ్రిని అరెస్ట్ చేయాలని ఎస్సీ సంఘాల డిమాండ్
  • గ్రామంలో ఉద్రిక్తతతో రంగంలోకి దిగిన పోలీసులు

తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ తండ్రి యువకుడిని బెదిరించగా, భయపడిపోయిన అతను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలోని ఈతముక్కల ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. పురుగుల మందు తాగి వెంకటకృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోగా, అతను ప్రేమించిన యువతి తండ్రే కారణమంటూ మృతుని బంధువులు ఆరోపించారు.

మూకుమ్మడిగా అతని ఇంటిపై దాడికి వెళ్లారు. ఇంటి ఆవరణలో కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. అతని బైకును ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ విధ్వంసం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి ఘర్షణలు మరింతగా చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకటకృష్ణ మరణానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఎస్సీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

Prakasam District
Sucide
Venkata Krishna
  • Loading...

More Telugu News