Vijayanagaram District: పార్వతీపురంలో రైలు కింద పడి తల్లీకుమార్తెల ఆత్మహత్య!

  • తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి  
  • కుటుంబ కలహాలే కారణం? 
  • మృతదేహాలు పోస్ట్ మార్టంకు తరలింపు

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. పార్వతీపురంలోని బూర వీధికి చెందిన శైలజ ఈ రోజు ఉదయం తన ఇద్దరు కుమార్తెలు రితిక (6), యామిని (4)లతో కలసి బెలగాం రైల్వే స్టేషన్ కు వచ్చింది.

అనంతరం రైలు వస్తుండగా ఇద్దరు కుమార్తెలతో పట్టాలపైకి దూకేసింది. వేగంగా వచ్చిన రైలు వీరిపై నుంచి వెళ్లిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అధికారుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కుటుంబ కలహాలే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Vijayanagaram District
Train Accident
Police
  • Loading...

More Telugu News