amith sha: ఖరీఫ్‌కి, రబీకి తేడా ఏంటో రాహుల్‌ చెప్పాలి : అమిత్‌ షా

  • ‘జై జవాన్‌ జై కిసాన్‌’ నినాదం అమల్లో కాంగ్రెస్‌ విఫలం
  • రైతుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉంది
  • 2022 నాటికి వారి ఆదాయం రెట్టింపునకు కృషి

‘రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తాం, వారి అభ్యున్నతికి పాటుపడతాం, హామీల విషయంలో మాట తప్పడం మా ఇంటావంటా లేదు’ అంటూ కర్నూల్‌ సభలో రాహుల్‌ సుదీర్ఘ ప్రసంగం నేపథ్యంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా వ్యంగ్యబాణం సంధించారు. ‘అసలు రాహుల్ కు ఖరీఫ్‌కు, రబీకి తేడా తెలుసా?’ అని ప్రశ్నించారు.  ‘జై జవాన్‌ జై కిసాన్‌’ నినాదం అమల్లో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలం అయిన విషయం ఆయన మర్చిపోయారా? అన్నారు. రైతుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉందని, 2022 నాటికి వారి ఆదాయం రెట్టింపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

amith sha
Rahul Gandhi
  • Loading...

More Telugu News