Hyderabad: హైదరాబాద్ లో నేడు జాబ్ మేళా!

  • ప్రకటించిన ఉపాధి కల్పన అధికారి
  • అపోలో హోంహెల్త్ కేర్ లో ఉద్యోగాలు
  • అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచన

హైదరాబాద్ లో ఈ రోజు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. మైత్రిప్రియ తెలిపారు. అపోలో హోంహెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్, మల్లేపల్లి, విజయనగర్ కాలనీలో జాబ్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాకు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

Hyderabad
job mela
appollo health care
  • Loading...

More Telugu News