Hyderabad: శ్రీకాకుళం వెళుతున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరి మృతి, 30 మందికి గాయాలు!

  • హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయలుదేరిన బస్సు
  • మునగాల సమీపంలో బోల్తా
  • అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

హైదరాబాద్ నుంచి గత రాత్రి శ్రీకాకుళం బయలుదేరిన శ్రీకృష్ణా ట్రావెల్స్ కు చెందిన బస్సు, మునగాల ప్రాంతంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు పల్టీ కొట్టడంతో తామంతా తీవ్ర ఆందోళనకు గురయ్యామని బస్సులోని ప్రయాణికులు వ్యాఖ్యానించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Hyderabad
Srikakulam
Sri Krishna Travels
Road Accident
  • Loading...

More Telugu News