Andhra Pradesh: సీఎం డ్యాష్ బోర్డుపై విరుచుకుపడిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

  • అది డ్యాష్ బోర్డు కాదు.. క్యాష్ బోర్డు
  • ఆసుపత్రిలో ఒక్క పరికరం కూడా పనిచేయడం లేదు
  • టీబీఎస్ సంస్థ వెనక ఎవరున్నారో

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విరుచుకుపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో 99 శాతం వైద్య పరికరాలు పనిచేస్తున్నట్టు సీఎం డ్యాష్ బోర్డు చూపిస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తాను ఇటీవల కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలిస్తే ఒక్క పరికరం కూడా పనిచేయలేదని, కానీ డ్యాష్ బోర్డు మాత్రం అన్నీ పని చేస్తున్నట్టు చూపిస్తోందన్నారు. అందులో చూపించినవన్నీ అసత్యాలనేనన్నారు. అది సీఎం డ్యాష్ బోర్డు కాదని, క్యాష్ బోర్డు అని విమర్శించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య పరికరాల నిర్వహణను కాంట్రాక్ట్ తీసుకున్న టీబీఎస్ సంస్థ వెనక ఎవరున్నారో తేలాల్సి ఉందని సోము వీర్రాజు అన్నారు.

Andhra Pradesh
Somu Veerraju
BJP
Telugudesam
Dash Board
Chandrababu
  • Loading...

More Telugu News