Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కొత్త సినిమాల గురించి కీర్తి సురేశ్! 
  • హిందీ సినిమాలో విజయ్ దేవరకొండ 
  • తమిళ చిత్రంలో నటిస్తున్న తాప్సీ
  • యువ దర్శకుడి చిత్రంలో బాలకృష్ణ!

*  తాజాగా తమిళంలో 'పందెం కోడి 2', 'సామి' చిత్రాలలో నటించిన కథానాయిక కీర్తి సురేశ్.. ప్రస్తుతం తాను ఏ కొత్త చిత్రాన్నీ అంగీకరించలేదని పేర్కొంది. తమిళ హీరో శశికుమార్ చిత్రంలో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేసింది. తెలుగు, తమిళ భాషల్లో కొత్తగా తాను ఏ సినిమాకూ సంతకం చేయలేదని చెప్పింది.
*  పలు చిత్రాలతో బిజీగా వున్న హీరో విజయ్ దేవరకొండ త్వరలో హిందీ సినిమాలో కూడా నటించనున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దీనికి రాజ్-డీకే దర్శక ద్వయం దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
*  ప్రస్తుతం ఒకటీ అరా హిందీ సినిమాలలో నటిస్తున్న కథానాయిక తాప్సీ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని తనే వెల్లడించింది. ఓ ప్రముఖ దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
*  ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ లతో 'ఎఫ్ 2' చిత్రాన్ని రూపొందిస్తున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలో నందమూరి బాలకృష్ణతో ఓ చిత్రం చేయనున్నట్టు తెలుస్తోంది. అనిల్ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పారట.

  • Loading...

More Telugu News