Tamilsai: సారీ.. ఏమనుకోకేం.. స్వీట్లతో ఆటోడ్రైవర్ ఇంటికెళ్లి క్షమాపణ చెప్పిన తమిళ బీజేపీ చీఫ్!

  • పెట్రోలు ధరల పెరుగుదలపై ప్రశ్నించిన ఆటోడ్రైవర్ కదిర్
  • పక్కకు తోసేసిన బీజేపీ నేత
  • ఇంటికెళ్లి క్షమాపణ చెప్పిన తమిళసై 

పెట్రోలు ధరలపై ప్రశ్నించినందుకు ఈడ్చి పడేసిన ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందరరాజన్ సారీ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతుండగా గమనించిన ఆటోడ్రైవర్ కదిర్ పెట్రోలు ధరల పెరుగుదలపై ప్రశ్నించాడు. ఆయన ప్రశ్న విని నవ్వుకున్న తమిళసై.. సమాధానం మాత్రం చెప్పలేదు. అయితే, పక్కనే ఉన్న బీజేపీ నేత కాళిదాస్ అతడిని రెక్కపట్టుకుని బయటకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది.

వీడియో వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన తమిళసై నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. స్వీట్లు పట్టుకుని కదిర్ ఇంటికి వెళ్లి క్షమాపణలు వేడుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లి స్వీట్లు పంచి క్షమాపణలు చెప్పిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ కదిర్ మాట్లాడుతూ.. తమిళసై మేడమ్ తన ఇంటికి వచ్చారని, కాళిదాస్ తనపై చేయి చేసుకున్న విషయం ఆమెకు తెలియదని చెప్పారని పేర్కొన్నాడు. తనకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు. పెట్రో ధరలను కేంద్రం త్వరలోనే తగ్గిస్తుందని మేడమ్ చెప్పారని కదిర్ పేర్కొన్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News