Chandrababu: చంద్రబాబును ఇరుకున పెట్టే వ్యూహం.. కోర్టు ధిక్కార పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్న బీజేపీ!

  • బాంబే హైకోర్టులో పిటిషన్ : జీవీఎల్
  • అసెంబ్లీలో సభా హక్కుల తీర్మానం
  • మోదీపై బాబు దుష్ప్రచారం: కన్నా

బాబ్లీ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ ‘కోర్టు ధిక్కార’ పిటిషన్ దాఖలు చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో బాంబే హై కోర్టులో ఈ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కోర్టులపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను న్యాయనిపుణులకు చూపించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కేంద్రంపై నిందలు వేస్తున్నందుకు శాసనసభలోనూ సీఎంపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు.

బాంబే హైకోర్టులో పిల్, శాసనసభలో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టి చంద్రబాబును ఇరుకున పెడతామని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అవినీతి, అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు కేంద్రంపైనా, మోదీపైనా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Chandrababu
Andhra Pradesh
BJP
Babli
Kanna
GVL
Telugudesam
  • Loading...

More Telugu News