anaj bank: పేదల పస్తులకు పరిష్కారాన్ని సూచించిన ప్రొఫెసర్ సునీతా సింగ్!
- అక్కడి పేదలకు పస్తులుండడం పరిపాటే
- కిలో బియ్యం ఇస్తే బ్యాంకులో సభ్యత్వం
- అవసరమైనపుడు అరువుగా 5 కిలోల బియ్యం
యూపీలోని జీబీ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ సునీతా సింగ్ నిరుపేదల కోసం అద్భుతమైన ఆలోచన చేశారు. అలహాబాద్ జిల్లాలోని కోరావ్, శంకర్‌గఢ్ గ్రామాలకు చెందిన చాలా మంది నిరుపేదలకు పస్తులుండటం పరిపాటే. దీనికి సునీత పరిష్కారాన్ని సూచించారు. పేదలకు ఎలాగైనా సాయం అందించాలన్న తలంపుతో ఆమె ఓ ఆలోచన చేశారు.
ఆలోచన వచ్చిందే తడవుగా స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రగతి వాహిని ఫౌండేషన్‌కు దాని గురించి తెలిపారు. ఆమె ఆలోచనకు కార్యరూపమే ‘అనాజ్ బ్యాంక్’. ప్రస్తుతం ఇది 20 గ్రామాల ప్రజలకు సేవలందిస్తోంది. అనాజ్ బ్యాంకులో ఎవరైనా కిలో బియ్యం ఇచ్చి సభ్యుడిగా చేరవచ్చు. వారికి అవసరమైనపుడు ఈ బ్యాంక్ 5 కిలోల బియ్యాన్ని అరువుగా ఇస్తుంది. ఈ 5 కిలోల బియ్యాన్ని 15 రోజుల్లోగా తిరిగి బ్యాంకులో జమ చేయాలి. దీని కోసం సునీతా సింగ్ ఆధ్వర్యంలో ఓ కమిటీ పని చేస్తోంది.