vangaveeti radha: విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వలేం: వంగవీటి రాధాకు తేల్చి చెప్పిన వైసీపీ

  • సెంట్రల్ సీటు ఇవ్వలేమంటూ అంబటి స్పష్టీకరణ
  • పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్న అంబటి
  • తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న వంగవీటి వర్గీయులు

వంగవీటి రాధాకృష్ణకు వైసీపీ షాక్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ టికెట్ తనకే ఇవ్వాలని రాధా పట్టుబడుతున్నప్పటికీ... ఈ సీటును కేటాయించలేమని స్పష్టం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ సీటును వంగవీటికి ఇవ్వలేమన్నదే పార్టీ హైకమాండ్ నిర్ణయమని స్పష్టం చేశారు.

గెలుపు, ఓటముల లెక్క ప్రకారమే సీట్ల కేటాయింపులు ఉంటాయని చెప్పారు. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అన్నారు.  అయితే వంగవీటి కుటుంబాన్ని వైసీపీ దూరం చేసుకోదని... రాధాకు విజయవాడ తూర్పు అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటును కేటాయిస్తామని తెలిపారు. అంబటి వ్యాఖ్యలతో వంగవీటి వర్గీయుల ఆగ్రహావేశాలు మరింత పెరిగాయి. వైసీపీతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వారు వచ్చారు.

vangaveeti radha
ysrcp
vijayawada central
ambari
  • Loading...

More Telugu News