ఉత్తరాఖండ్ అడవుల్లో ఏనుగును చంపి.. దంతాల చోరీ!
- పునరావృతమైన 2001నాటి ఘటన
- మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం
- నివేదిక ఆధారంగా దర్యాప్తు
ఉత్తరాఖండ్‌లోని శివాలిక్ అటవీ ప్రాంతంలో కొందరు దుండగులు 45 ఏళ్ల మగ ఏనుగును చంపి, దాని దంతాలను ఎత్తుకుపోయారు. ఈ విషయాన్ని డెహ్రాడూన్ అటవీశాఖాధికారి ధర్మసింగ్ మీణా స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఆధారంగా అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.