Devotees: పూజారుల వల్లే భక్తుల్లో భయం లేకుండా పోయింది!: మద్రాస్ హైకోర్టు

  • ప్రాచీన విగ్రహాల చోరీపై ఆగ్రహం
  • ఆలయ పూజారులపై సంచలన వ్యాఖ్యలు
  • పూజారులు యాంత్రికంగా పనిచేస్తున్నారు

ఆలయ పూజారులకు మద్రాస్ హైకోర్టు చురకంటిస్తూ, సునిశిత విమర్శలు చేసింది. ఆలయాల్లో అతి ప్రాచీన విగ్రహాల చోరీకి సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయాల్లో విగ్రహాల చోరీకి కారణం పూజారుల్లో భక్తి లోపించడమేనని పేర్కొంది. ఈ రోజుల్లో పూజారులు భక్తితో కాకుండా యాంత్రికంగా పనిచేస్తున్నారంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా పూజారుల వల్లే భక్తుల్లో కూడా భయం లేకుండా పోయిందని కోర్టు అభిప్రాయపడింది.

Devotees
MADRAS
High Court
  • Loading...

More Telugu News