Rahul Gandhi: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరుతాం: కర్నూలు విద్యార్థులతో రాహుల్ గాంధీ

  • ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
  • కార్పొరేట్ శక్తుల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోంది
  • ఉద్యోగాలను కల్పించడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారు

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. కర్నూలులో బైరెడ్డి ఫంక్షన్ హాల్ లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని చెప్పారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందాలని తెలిపారు. మోదీ ప్రభుత్వం కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తుల కోసమే పని చేస్తోందని విమర్శించారు. ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో గద్దెనెక్కిన మోదీ... ఆ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రతి రోజు చైనా 50వేల ఉద్యోగాలను సృష్టిస్తుంటే... మన దేశంలో మాత్రం రోజుకు 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని చెప్పారు. 

Rahul Gandhi
kurnool
students
special status
  • Loading...

More Telugu News