damodaram sanjeevaiah: కర్నూల్ లో రాహుల్.. దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులతో మాటామంతీ!

  • కర్నూలులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ
  • పెదపాడులోని సంజీవయ్య ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులతో మాట్లాడిన వైనం
  • అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సమావేశానికి పయనం

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కర్నూలు చేరుకున్నారు. అనంతరం ఆయన పెదపాడులోని మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య నివాసానికి వెళ్లారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అక్కడ ఏర్పాటు చేసిన సంజీవయ్య ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

ఈ సందర్భంగా రాహుల్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. రాహుల్ తోపాటు సంజీవయ్య ఇంటికి రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి తదితర నేతలు కూడా వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి విద్యార్థులతో ముఖాముఖి సమావేశానికి హజరుకావడానికి ఆయన బయల్దేరారు.

damodaram sanjeevaiah
Rahul Gandhi
kurnool
congress
  • Loading...

More Telugu News