YSRCP: నాకు చాలా అన్యాయం చేశారు: వైసీపీపై వంగవీటి ఫైర్

  • వైసీపీలో కలకలం రేపుతున్న విజయవాడ సెంట్రల్ వైసీపీ టికెట్
  • మల్లాది విష్ణుకు కేటాయించారన్న వార్తలతో వంగవీటి వర్గీయుల నిరసన
  • ఒక మూడు రోజులు ఓపిక పడదామన్న రాధా

వైసీపీ హైకమాండ్ పై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... అయినా తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించారన్న వార్తలు విజయవాడ వైసీపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ సీటును ఆశిస్తున్న రాధా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఈరోజు తన సన్నిహితులు, అనుచరులతో రాధా సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా రాధా వర్గీయులు మాట్లాడుతూ, రాధాకు వైసీపీ చాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. దీనికి సమాధానంగా రాధా మాట్లాడుతూ, మనకు అన్యాయం జరుగుతున్న సంగతి వాస్తవమేనని... అయినా ఒక మూడు రోజులు ఓపిక పడదామని తన అనుచరులకు సూచించారు. మనం ఇప్పటికీ పార్టీలోనే ఉన్నామని... టికెట్ విషయమై అధిష్ఠానంతో మాట్లాడదామని చెప్పారు. హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు.

YSRCP
vijayawada
central
ticket
vangaveeti radha
malladi vishnu
  • Loading...

More Telugu News