YSRCP: నేడు రంగా-రాధా మిత్రమండలి కీలక సమావేశం... కీలక నిర్ణయం తీసుకోనున్న వంగవీటి బ్యాచ్!

  • కాసేపట్లో సమావేశం నిర్వహించనున్న వంగవీటి రాధా
  • ఇప్పటికే వైకాపాకు శ్రీనివాస ప్రసాద్ రిజైన్
  • పార్టీ మారనున్నారన్న వార్తలతో వైకాపాలో కలకలం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడాలని ఆశిస్తూ, ఈ విషయంలో జగన్ నుంచి స్పష్టమైన హామీ రాలేదని అలకబూనిన వంగవీటి రాధా కృష్ణ, నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో 'రంగా-రాధా మిత్రమండలి' సమావేశం జరుగనుండగా, పార్టీ మారే విషయమై తన అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలను రాధ కోరనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

 కాగా, నిన్న రాధ పార్టీ మారనున్నారన్న వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి, పలువురు వైసీపీ నేతలు తొందరపడవద్దని రాధకు సూచించిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబంలోని ఉయ్యూరు నేత శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేశారు. శ్రీనివాస ప్రసాద్ తరువాత వంగవీటి రాధ కూడా పార్టీ మారుతారన్న వార్తలు వైకాపాలో తీవ్ర కలకలం రేపాయి.

YSRCP
Vangaveeti Radha
Vijayawada
  • Loading...

More Telugu News