Telangana: ఏం న్యాయం చేద్దామని?: తెలంగాణ ముందస్తు ఎన్నికలపై నటి గౌతమి కామెంట్

  • ఐదేళ్లూ అధికారంలో ఉండాలని ప్రజలు భావిస్తారు
  • మంచి మెజారిటీ ఇచ్చిన వేళ, ముందుగానే ఎన్నికలు ఎందుకు?
  • నటి గౌతమి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, నటి గౌతమి అనూహ్యంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ముందస్తు ఎన్నికలతో ఎంతవరకూ న్యాయం చేయగలుగుతామన్న విషయాన్ని ఆలోచించుకోవాలని అన్నారు. తెలంగాణలో ముందస్తుతో ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయాన్ని తొలుత పక్కన పెట్టాలని, కానీ, తమకు మేలు జరుగుతుందన్న నమ్మకంతో మంచి మెజారిటీ ఇచ్చి, నిండు ఐదేళ్లూ ప్రభుత్వాన్ని నడిపించాలని ప్రజలు కోరుకుంటారని గౌతమి అభిప్రాయపడింది. తమ భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తారని, అన్ని పనులు జరుగుతాయని నమ్మకంతో ప్రజలు ఉన్న వేళ, ఐదేళ్లూ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమంపై ముందుకెళ్లకుండా, ముందుగానే ఎన్నికలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించింది.

Telangana
Elections
Gowthami
Actress
  • Loading...

More Telugu News