Miryalaguda: 'ఆంటీ ఆంటీ...' అంటూ అమృత పరిగెత్తుకొచ్చింది.... తిరిగొచ్చి చూస్తే పడిపోయి కనిపించింది!: డాక్టర్ జ్యోతి

  • ప్రణయ్ పరువు హత్య రోజు ఘటనను వివరించిన వైద్యురాలు
  • ఐదు నిమిషాల ముందు వరకూ అమృత దంపతులు తనతోనే ఉన్నారని వెల్లడి
  • భవిష్యత్తులో ఇంకెవరికీ ఈ పరిస్థితి రాకూడదన్న డాక్టర్ జ్యోతి

గత శుక్రవారం నాడు మిర్యాలగూడలో తన ఆసుపత్రి ముందు జరిగిన ప్రణయ్ పరువుహత్యను తలచుకున్న డాక్టర్ జ్యోతి కన్నీరు పెట్టుకున్నారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఈ ఘటన జరగడానికి ఐదు నిమిషాల ముందు వరకూ ప్రణయ్, అమృత వర్షిణి తన వద్దే ఉన్నారని, గర్భవతిగా ఉన్న అమృతకు జాగ్రత్తలు చెప్పి, మళ్లీ పది రోజుల తరువాత రావాలని చెప్పి పంపానని అన్నారు.

"ఆపై నిమిషాల వ్యవధిలోనే పరిగెత్తుకుంటూ వచ్చి, 'ఆంటీ... ఆంటీ... ప్రణయ్ ని పొడిచేశారు' అంది. నేను బయటకెళ్లి ఆ అబ్బాయిని చూసి, వెనక్కు వచ్చేసరికి ఈ అమ్మాయి పడిపోయింది ఇక్కడ. తనకు కావాల్సిన ట్రీట్ మెంట్ అందిస్తూ, స్టెబిలైజ్ చేయడానికి చాలా సమయం పట్టింది. యాక్చువల్ గా ప్రణయ్ చనిపోయాడన్న విషయం, తరువాతి రోజు ఉదయం వరకూ ఆమెకు చెప్పలేదు" అన్నారు. ప్రణయ్ హత్య సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఘటనని అభివర్ణించిన ఆమె, దీన్ని అందరూ ఖండించాలని, భవిష్యత్తులో ఇంకెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని అన్నారు.

Miryalaguda
Pranay
Amrutha
Doctor Jyothy
  • Loading...

More Telugu News