Road Accident: కుమారుడి అంత్యక్రియలకు ఇంటికి వస్తే, సైనిక రహస్యాలు చెప్పాలంటూ మట్టుబెట్టిన ముష్కరులు!

  • రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి
  • అంత్యక్రియల నిమిత్తం హాజరైన లాన్స్ నాయక్ ముఖ్తార్ అహ్మద్ మాలిక్
  • ఆర్మీ రహస్యాలు చెప్పాలని తలకు తుపాకి గురి
  • ఒక్క మాట కూడా మాట్లాడని ముఖ్తార్

ఉగ్రవాదులు తలకు తుపాకి గురిపెట్టారు. ఆర్మీ సైనిక రహస్యాలు చెప్పకుంటే హత్య చేస్తామని బెదిరించారు. అయినా సరే దేశంకోసం తన నోటి నుంచి ఒక్క మాటైనా రానీయలేదా ధైర్యశాలి. ఇక అతన్నుంచి తమకు ఎటువంటి సమాచారం రాదని తెలుసుకున్న ముష్కరులు, అతన్ని దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన జమ్ము, కశ్మీర్ లో కలకలం రేపింది. కుల్గామ్‌ లోని ఛురత్‌ గ్రామానికి చెందిన లాన్స్‌నాయక్‌ ముఖ్తార్‌ అహ్మద్‌ మాలిక్‌, టెరిటోరియల్‌ దళానికి చెందిన 162వ బెటాలియన్‌ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

నాలుగు రోజుల క్రితం 15వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు చనిపోగా, అంత్యక్రియల నిమిత్తం, మాలిక్‌ స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉగ్రవాదులు, ఆయన ఇంట్లోకి చొరబడి, సైనిక స్థావరాలకు సంబంధించిన వివరాలు చెప్పాలని బెదిరించారు. ఏమాత్రం భయపడని మాలిక్, "కావాలంటే నన్ను చంపుకోండి. ప్రశ్నలు మాత్రం అడగొద్దు" అని కరాఖండిగా చెప్పాడు. దీంతో ఉగ్రవాదులు మాలిక్‌ పై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చడంతో మాలిక్ అక్కడికక్కడే విగతుడయ్యాడు.

Road Accident
Jammu And Kashmir
Terrorists
Army
  • Loading...

More Telugu News