chiranjeevi: 50 కోట్ల ఖర్చుతో జార్జియాలో 'సైరా' యుద్ధం

- జార్జియాలో 20 రోజులపాటు షూటింగ్
- వేల సంఖ్యలో విదేశీ జూనియర్ ఆర్టిస్టులు
- వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు 'జార్జియా'లో జరుగుతోంది. శనివారం రోజున అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడ భారీస్థాయిలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియాలోని సువిశాలమైన ప్రాంతంలో ఈ యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేశారు.
