Poonam kaur: ప్రణయ్ పరువు హత్యపై స్పందించిన హీరోయిన్ పూనమ్ కౌర్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-c61a19b6dce344b105fc2b9c4827db3e221c3036.jpg)
- పరువు హత్యపై పూనమ్ ఆవేదన
- ఘటన మనసును కలచివేస్తోందని వ్యాఖ్య
- ట్విట్టర్ లో స్పందించిన నటి
మిర్యాలగూడ పరువు హత్య ఘటనపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నా ఇంకా ఇలాంటి మూస ఆలోచనలను పట్టించుకోవడం ఏంటని వ్యాఖ్యానించింది. కుమార్తె అమృతను పెళ్లి చేసుకున్న ప్రణయ్ ను వేరే కులం వాడన్న కారణంగా మామ మారుతీరావు కిరాతకంగా హత్య చేయించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేస్తోందని పూనమ్ చెప్పింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించింది.
‘ప్రజలంతా ప్రేమకు వ్యతిరేకంగా ఎందుకున్నారు? ఇలాంటి పనుల ద్వారా ఏం సాధిస్తారు? అమృత-ప్రణయ్ జంటకు న్యాయం జరిగేది ఎప్పుడు? మనం నిజంగానే 21వ శతాబ్దంలో ఉన్నామా? ప్రణయ్ హత్య, అమృత రోదన నా మనసును కలచివేస్తోంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అమృత-ప్రణయ్ ల ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో లింక్ ను ఈ ట్వీట్ కు ఆమె జత చేసింది.